![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -49 లో..... సింహాద్రిని భువన కలుస్తుంది. నువ్వు చెప్పినట్లే జరుగుతుంది అన్నయ్య ఆ జాను నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుందని భువన అంటుంది. అవును అమ్మ వాడి మంచి కోరుకునేవాడిని నేను అని సింహాద్రి అంటాడు. మరొకవైపు సూర్య దగ్గరికి జాను వచ్చి చాలా థాంక్స్ సూర్య.. నువ్వు చాలా సపోర్ట్ గా ఉన్నావని జానూ అంటుంది. ఇలాగే ఎప్పుడు నాకు తోడుగా ఉంటావా అని జాను అనగానే నువ్వు పొమ్మన్నా పోను అని సూర్య అంటాడు. దాంతో జాను తనన హగ్ చేసుకుంటుంది.
ఆ తర్వాత శంకర్ ఫోటో పట్టుకొని శారద బాధపడుతుంది. తనకి జాను ధైర్యం చెప్తుంది. ఇంట్లో అందరం పనులు చెయ్యాలని జానూ చెప్తుంది. అందరు సరే అని మొదలుపెడతారు. నందు ఇల్లు క్లీన్ చేస్తుంది. అప్పుడే మురళి వచ్చి పడిపోతుంటే నందు పట్టుకుంటుంది. అప్పుడే అమెరికా అబ్బాయి అరవింద్ వాళ్ళ నాన్న వచ్చి.. మీ జంట బాగుందని అంటాడు. ఆ తర్వాత తోట విషయం త్వరలోనే తేలుస్తాని జానూ చెప్పగానే అవసరం లేదు మాకు వేరే సంబంధం వచ్చిందని ఇక ఈ పెళ్లి జరగదని చెప్పి వెళ్ళిపోడానికి వచ్చానని అతను చెప్తాడు. దాంతో అందరు రిక్వెస్ట్ చేస్తారు. నందు ఏడుస్తుంటే మురళి వచ్చి అతని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు.
తనకి అమెరికా వెళ్లాలని ఆశ.. ప్లీజ్ ఈ పెళ్లి జరిపించండి అని మురళి రిక్వెస్ట్ చేస్తాడు. అంత ఎందుకు నువ్వే చేసుకోవచ్చు కదా అని అతను అంటాడు. అప్పుడే సింహాద్రి వచ్చి వాళ్ళు డబ్బు మనుషులు.. వాళ్ళ సంబంధం పోతే పోనీలే అని అంటాడు. తరువాయి భాగంలో అమెరికా నుంచి సంబంధం వచ్చిందని సింహాద్రి చెప్తాడు. పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు. నాకు అబ్బాయి జాబ్ డీటేల్స్ కావాలని జాను అనగానే సింహాద్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |